అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హీరో రానా నటించిన 'విరాట పర్వం' నుంచి ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో మహిళల గొప్పతనం గురించి రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇందులో సాయిపల్లవి, ప్రియమణి, ఈశ్వరి రావు తదితరుల చిత్రాలు కనిపించాయి.
"చరిత్రలో దాగివున్న కథలకు తెరలేపిన ప్రేమ తనది. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమేనని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహాసంక్షోభమే మహా గొప్ప శాంతికి దారితీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాట పట్టిన అనేకమంది వీర తల్లులకు వీళ్లు ప్రతిరూపాలు. వీళ్ల మార్గం అనన్యం. అసామాన్యం. రెడ్ సెల్యూట్." అంటూ రానా చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.