'ఘర్షణ' చిత్రానికి సీక్వెల్ తీసుకొచ్చే అవకాశాలున్నాయా? తాజాగా కథానాయకుడు రానా చేసిన ట్వీట్‌ను చూస్తుంటే సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది. వెంకటేష్ - దర్శకుడు గౌతమ్‌మేనన్ కలయికలో 'ఘర్షణ' తెరకెక్కి అప్పట్లో బాక్సాఫీస్ వద్ద చక్కటి ఆదరణ, వసూళ్లు సాధించింది. ఈ చిత్రంతో నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు వెంకీ. ఈ చిత్రం విడుదలై గురువారానికి 16ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే 'ఘర్షణ'ను ఉద్దేశిస్తూ రానా చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
'ఘర్షణ' చిత్రానికి సీక్వెల్.. హీరో ఎవరు? - రానా వెంకటేశ్
విక్టరీ వెంకటేష్ హీరోగా గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన చిత్రం 'ఘర్షణ'. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందనుందా? అనే విషయమై చర్చ నడుస్తోంది. హీరో రానా చేసిన ఓ ట్వీట్ అందుకు బలం చేకూరుస్తోంది.
"మీలో ఎంతమంది ‘ఘర్షణ’కు సీక్వెల్ కావాలి అని కోరుకుంటున్నారు? నేను చేస్తాను!"’ అని ట్వీట్ చేశారు రానా. దీంతో ఇప్పుడీ చిత్ర సీక్వెల్‌పై చిత్ర పరిశ్రమలో చర్చ మొదలైంది. ఎందుకంటే ఇలాంటి పోలీస్ కథలకు కొనసాగింపు చిత్రాలు తీసుకురావడానికి మంచి అవకాశముంటుంది. ఒకవేళ ఇదే జరిగితే ఈసారి రాబోయే సీక్వెల్‌లో రానా కథానాయకుడిగా నటిస్తారా? లేకపోతే తన నిర్మాణంలో బాబాయ్ వెంకటేష్‌తోనే మరో 'ఘర్షణ'ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం వెంకటేష్ హీరోగా 'నారప్ప' తెరకెక్కుతోంది. దీని తర్వాత ఆయన దర్శకులు తరుణ్ భాస్కర్, అనిల్ రావిపూడి చిత్రాలు చేయాల్సి ఉంది.