తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆగస్టు 8న రానా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో

దగ్గుబాటి రానాకు ప్రేయసి మిహీకా బజాజ్​తో ఇటీవలే నిశ్చితార్థమైంది. అయితే వీరి పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు రానా. ఆగస్టు 8న వివాహం చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు.

ఆగస్టు 8న రానా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో
ఆగస్టు 8న రానా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో

By

Published : Jul 25, 2020, 5:38 PM IST

Updated : Jul 25, 2020, 5:45 PM IST

కెరీర్‌లో విభిన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న యువ నటుడు దగ్గుబాటి రానా. కేవలం కథానాయకుడిగానే కాదు, ప్రతినాయకుడిగానూ మెప్పించాడు. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మిహీకా బజాజ్‌తో ఆయన వివాహం జరగనుంది. ఆగస్టు 8న పెళ్లి చేసుకోబోతున్నట్లు రానా తాజాగా మరోసారి స్పష్టం చేశాడు.

రానా, మిహీక

"నేను వివాహం చేసుకునే సరైన సమయం ఇదేననుకుంటున్నా. నా ప్రేమికురాలు మిహీకా కుటుంబం మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మేమంతా ఒకే ప్రాంతంలో ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు సాఫీగా సాగిపోతుంటాయి. ఆమే నాకు కరెక్ట్‌ జోడీ. ప్రతి విషయంలోనూ ఒకరికొకరం అండగా ఉంటాం. ఆగస్టు 8న తనని వివాహం చేసుకోబోతున్నా. ఆ రోజు నా జీవితంలో అత్యుత్తమమైన, అద్భుతమైన రోజు."

-రానా, నటుడు

ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ పెద్ద వేదికగా ఎదుగుతుందని అభిప్రాయపడిన రానా, కొత్త నటులు కూడా గుర్తించబడతారని పేర్కొన్నాడు. తనకు చారిత్రక, పౌరాణిక సినిమాలు, పాత్రలంటే ఇష్టమన్నాడు. అదే సమయంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలు కూడా పోషించడానికి సిద్ధమని చెప్పుకొచ్చాడు రానా. ఇక చిత్ర పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం గురించి మాట్లాడుతూ.. నైపుణ్యం లేకపోతే ఎవరు కూడా రాణించలేరని తెలిపాడు. ‘

రానా కీలక పాత్రలో నటించిన 'అరణ్య' విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో పాటు, 'విరాట పర్వం', 'హిరణ్య కశ్యప' తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు.

Last Updated : Jul 25, 2020, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details