తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ రీమేక్​లో రానా-విశ్వక్​సేన్! - rana movies

బాలీవుడ్​ హిట్​ సినిమా 'సోను కే టిటు కి స్వీట్'.. తెలుగు రీమేక్​లో రానా-విశ్వక్​సేన్ కలిసి నటిస్తారనే వార్తలొస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

రానా-విశ్వక్​సేన్

By

Published : Nov 8, 2019, 6:16 AM IST

రానా.. కథానాయకుడిగా నటిస్తూనే.. అవకాశం దొరికినప్పుడల్లా ప్రతినాయక పాత్రలతోనూ అలరిస్తున్నాడు. అందుకే ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఈ యువ హీరో ఓ బాలీవుడ్‌ హిట్‌ రీమేక్‌పై ప్రస్తుతం కన్నేశాడట. మినీ మల్టీస్టారర్‌గా రూపొందబోయే ఈ చిత్రంలో మరో కథానాయకుడు విశ్వక్​సేన్‌తో తెర పంచుకోబోతున్నాడట.

కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా నటించిన 'సోను కే టిటు కి స్వీటీ'. ఈ సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడీ కథ రానాకు విపరీతంగా నచ్చేసింది. వెంటనే పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చమని ఓ స్టార్‌ దర్శక రచయితకు బాధ్యతలు అప్పగించాడట.

సోనూ కే టిటూకి స్వీటీ సినిమా పోస్టర్

ఇందులో మరో కథానాయకుడి పాత్ర కోసం విశ్వక్‌ సేన్‌ను తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు రానా. ఇటీవలే వీళ్లిద్దరూ కలిశారు. సోషల్​ మీడియాలో ఈ ఫొటో చక్కర్లు కొట్టింది.

ఇది చదవండి: '1945' నిర్మాత మోసంపై హీరో రానా ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details