తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హారర్'​ గూటికి చేరిన భళ్లాలదేవుడు..! - HORRER FILM

ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్న రానా.. ఓ హారర్​ కథకు పచ్చజెండా ఊపాడని సమాచారం. మిలింద్​ రావు దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హీరో దగ్గుబాటి రానా

By

Published : Sep 17, 2019, 6:34 AM IST

Updated : Sep 30, 2019, 10:06 PM IST

'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు రానా. ఆ తర్వాత వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోల జాబితాలోకి చేరాడు. హాథీ మేరి సాథీ, 1945, విరాటపర్వంలో నటిస్తూ తీరికలేకుండా ఉన్నాడు. గుణశేఖర్​ రూపొందించే 'హిరణ్యకశ్యప'లోనూ ఇతడే ప్రధాన పాత్రధారి. తన కెరీర్​లో తొలిసారిగా ఓ హారర్​ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడని సమాచారం.

హీరో దగ్గుబాటి రానా

సిద్దార్థ్​తో 'గృహం' తీసిన దర్శకుడు మిలింద్​ రావు.. రానాకు ఓ కథ వినిపించాడట. ఆ స్టోరీ దగ్గుబాటి హీరోకు బాగా నచ్చిందట. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటివరకు పలు విభిన్న పాత్రలు పోషించిన రానా.. హారర్​ కథతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

ఇది చదవండి: సైరా ప్రీరిలీజ్​ వాయిదా!.. మరి ట్రైలర్..?

Last Updated : Sep 30, 2019, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details