తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రానా "గానా"... విశాల్ 'యాక్షన్' కోసం పాట

కథానాయకుడు రానా.. హీరో విశాల్ 'యాక్షన్' సినిమా తెలుగు వెర్షన్​లోని ఓ పాట పాడాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడు విశాల్.

విశాల్​ కోసం పాట పాడిన హీరో రానా

By

Published : Nov 10, 2019, 4:15 PM IST

Updated : Nov 10, 2019, 5:48 PM IST

టాలీవుడ్​ హీరో రానా కొత్త అవతారమెత్తాడు. నటుడు, నిర్మాతగా తానెంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు గాయకుడిగా మారాడు. కోలీవుడ్​ నటుడు​ విశాల్ 'యాక్షన్' సినిమాలోని 'లైట్స్​..కెమెరా.. యాక్షన్' అనే పాట పాడాడు. సంగీత దర్శకుడు హిప్ అప్ తమిళ, విశాల్.. అందుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు.

రానా పాటపై హీరో విశాల్ ట్వీట్

పూర్తిస్థాయి యాక్షన్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. తమన్నా హీరోయిన్​. సుందర్.సి దర్శకత్వం వహించాడు. ఈ నెల 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఇది చదవండి: 'యాక్షన్​'తో అదరగొడుతున్న విశాల్..!

Last Updated : Nov 10, 2019, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details