తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఘనంగా రానా-మిహీక వివాహం

దగ్గుబాటి హీరో రానా ఓ ఇంటివాడయ్యాడు. వధువు మిహీకా బజాజ్​ మెడలో మూడుముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు.

ఘనంగా రానా-మిహీక వివాహం
ఘనంగా రానా-మిహీక వివాహం

By

Published : Aug 8, 2020, 9:28 PM IST

Updated : Aug 8, 2020, 10:58 PM IST

సినీ నటుడు రానా దగ్గుబాటి వివాహం ఘనంగా జరిగింది. వధువు మిహీకా బజాజ్‌ మెడలో మూడుముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు. రామానాయుడు స్టూడియోలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కుటుంబసభ్యులు, కొద్ది మంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

రానా దంపతులతో చరణ్ దంపతులు

మే నెలలో రానా తన ప్రేమ సంగతి బయటపెట్టాడు. మిహీకా బజాజ్‌ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లికి అంగీకరించాయి. దీంతో శనివారం రాత్రి సుమూహుర్త సమయంలో రానా-మిహీక ఒక్కటయ్యారు.

పెళ్లి దృశ్యం
వెంకటేశ్
నాగచైతన్య
Last Updated : Aug 8, 2020, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details