డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రానా(rana daggubati movies).. మరో క్రేజీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో తీయబోయే ఈ సినిమాకు 'నేత్రికన్' మిలింద్ ఫేమ్ మిలింద్ రావు దర్శకుడు. వచ్చే ఏడాది ప్రారంభంల ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే కాకుండా రానా 'విరాటపర్వం'(virata parvam release date) విడుదలకు సిద్ధంగా ఉంది. సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను ఏప్రిల్లోనే థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల అదికాస్త వాయిదా పడింది. అప్పటి నుంచి రిలీజ్ కాకుండా అలా ఉండిపోయింది.