రెండో దశ కరోనా ఉద్ధృతి వల్ల పూట గడవడానికి ఇబ్బంది పడుతున్న గిరిజనులకు హీరో రానా అండగా నిలిచారు. నిర్మల్ జిల్లాలోని 400 గిరిజన కుటుంబాలకు నిత్యావసరాలతో పాటు మందులు అందించారు. నిర్మల్‌లోని గుర్రం మధిర, పాల రేగడి, అద్దాల తిమ్మాపూర్, మిసాల భూమన్న తదితర గ్రామాల ప్రజలకు ఈ సాయం అందించారు.
400 గిరిజన కుటుంబాలకు హీరో రానా సాయం - హీరో రానా లేటేస్ట్ న్యూస్
కరోనా వల్ల పూట గడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న 400 గిరిజన కుటుంబాలకు హీరో రానా సాయం చేశారు. నిత్యావసరాలు, మందులు అందజేశారు.
హీరో రానా
‘పచ్చీస్’ ట్రైలర్: రామ్స్ కథానాయకుడిగా శ్రీకృష్ణ, రామసాయిలు సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పచ్చీస్’. కత్తూరి కౌశిక్ కుమార్, రామ సాయి నిర్మిస్తున్నారు. శ్వేతావర్మ కథానాయిక. ఈనెల 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రానా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
ఇది చదవండి:పవన్-రానా చిత్రంలో స్టార్ దర్శకుడు!