తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమా కోసం గాయకుడిగా మారిన రానా! - రానా విరాటపర్వం

ఇప్పటికే తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న దగ్గుబాటి వారసుడు రానా.. త్వరలోనే తనలోని మరో టాలెంట్​ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రంలో ఓ పాటను తానే(Rana Daggubati Movies) స్వయంగా పాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Rana Daggubati
రానా

By

Published : Sep 26, 2021, 7:37 AM IST

'లీడర్', 'బాహుబలి', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు రానా దగ్గుబాటి(Rana Daggubati Movies). ఆయన హీరోగా నటిస్తున్న మరోచిత్రం 'విరాటపర్వం' కోసం తొలిసారి ఆయన గాత్రం వినిపించనున్నాడు. ఈ చిత్రంలోని ఓ ఆలోజింపచేసే పాటను పాడేందుకు రానా సిద్ధమవుతున్నారని టాలీవుడ్​లో టాక్ వినిపిస్తోంది. ఈ పాటను వచ్చేవారం రికార్డింగ్​ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన 'విరాటపర్వం' సినిమాలో(Virata Parvam Release Date) రానా సరసన సాయిపల్లవి హీరోయిన్​గా నటించగా.. ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. 2021 ఏప్రిల్​లోనే ఈ చిత్రం విడుదల కావాల్సిఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

.

పవన్​తో మల్టీస్టారర్​

మల్టీస్టారర్​గా తెరకెక్కుతున్న 'భీమ్లానాయక్' చిత్రంలో డేనియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నాడు. ఆయన పాత్రకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్​ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నాడు.

మరోవైపు బాబాయ్ వెంకటేశ్​తో కలిసి ఓ వెబ్​సిరీస్​లోనూ నటించనున్నాడు రానా. పాపులర్ అమెరికన్ డ్రామా సిరీస్​ 'రే డోనోవాన్​'ను 'రానా నాయుడు' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:వెంకటేశ్ షాకింగ్ లుక్.. రానాతో కలిసి వెబ్ సిరీస్

ABOUT THE AUTHOR

...view details