ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి హీరోగా నటించిన బహుభాషా చిత్రం 'హాథీ మేరే సాథి'(తెలుగులో అరణ్య).. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ట్వీట్ చేసింది.
సంక్రాంతి రేసులో రానా 'అరణ్య' - రానా అరణ్య అప్డేట్స్
హీరో రానా కూడా సంక్రాంతి రేసులోకి వచ్చారు. పలు పెద్ద సినిమాలకు పోటీగా తన 'అరణ్య'ను తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
సంక్రాంతి రేసులో రానా 'అరణ్య'
అడవులు, జంతువుల కోసం పోరాడే ఓ వ్యక్తి కథతో ఈ సినిమా తీశారు. ప్రభు సాలోమన్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్, శ్రియా పిలగాంకర్, జోయా హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని, ఈ ఏడాది ఏప్రిల్ 2న తీసుకురావాలని అనుకున్నారు. కరోనా ప్రభావంతో అది కాస్త వాయిదా పడింది.
ఇదీ చూడండి:'ఆర్ఆర్ఆర్' టీజర్‌పై చరణ్ ట్వీట్.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై