టాలీవుడ్ ఆజానుబాహుడు.. దగ్గుబాటి వారసుడు.. రానా పుట్టినరోజు నేడు(డిసెంబరు 14). 'లీడర్' లాంటి సామాజిక ఇతివృత్తమున్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రతిభావంతుడైన నటుడిగా మెప్పించారు.
కెరీర్ ప్రారంభంలో ఆచితూచి అడుగులేసిన రానా.. 'బాహుబలి'తో ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో భళ్లాలదేవ లాంటి క్రూరమైన విలన్ పాత్రలో ఒదిగిపోయారు. రుద్రమదేవి లాంటి సినిమాతో మంచి ఇమేజ్ సంపాందించారు. ఘాజీ, నేనే రాజు నేనేమంత్రి చిత్రాలతో స్టార్‌గా మారిపోయారు.
ఓ వైపు తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు హిందీలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు రానా. దమ్ మారో దమ్తో బాలీవుడ్‌కు వెళ్లి... డిపార్ట్మెంట్, బేబీ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నారు. తమిళనాట రానాకు మంచి గుర్తింపు ఉంది. అజిత్ 'ఆరంభం'లోనూ కీలకపాత్ర పోషించారు. ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ రానాకు స్టార్ ఇమేజ్ ఉంది.
డిజిటల్ తెరపై
డిజిటల్ మాధ్యమంలో ప్రసారమవుతున్న 'నెంబర్ వన్ యారీ' ప్రోగ్రామ్‌కు రానా యాంకర్. ఈ షోతో మంచి పేరు తెచ్చుకున్నారు.
నిర్మాతగా