అగ్రకథానాయకుడు రానా తన జీవితంలోని అత్యంత కఠిన ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' తెలుగు వెర్షన్లో థానోస్కు డబ్బింగ్ చెప్పడం మనసుకు ఎలా తెరిపినిచ్చిందో వెల్లడించారు.
గతంలో ఓసారి అమెరికాలో ఉన్నప్పుడు తన బీపీ గురించి వైద్యులు చెప్పారని రానా అన్నారు. కొన్ని అవయవాలు కూడా విఫలమవుతాయని చెప్పినట్లు వెల్లడించారు. ఆ విషయాన్ని తీసుకోవడానికే చాలా సమయం పట్టిందని తెలిపారు.