యువ నటుడు నాగశౌర్య జాగ్రత్తగా ఉండాలని రానా దగ్గుబాటి సూచించారు. మనుషుల వేషధారణ చూసి మోసపోవద్దన్నారు. అసలేం జరిగిందంటే.. నాగశౌర్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో నటుడు బ్రహ్మాజీ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా శౌర్య-బ్రహ్మాజీలకు సంబంధించిన కొన్ని కామెడీ సన్నివేశాల షూట్ జరిగింది. షూట్ అనంతరం బ్రహ్మాజీ ముఖానికి నామాలు పెట్టుకుని.. అమాయకపు లుక్‌లో నాగశౌర్యతో ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఫొటోని షేర్ చేసిన శౌర్య.. "నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించండి" అని సరదాగా ట్వీట్ చేశారు.
నాగశౌర్య.. దయచేసి జాగ్రత్తగా ఉండు: రానా - రానా దగ్గుబాటి బ్రహ్మాజీ
యువ నటుడు నాగశౌర్యను జాగ్రత్తగా ఉండాలని సూచించారు రానా దగ్గుబాటి. అసలేం జరిగిందో తెలుసుకోండి.
కాగా, ఈ ట్వీట్‌పై శనివారం రానా స్పందించారు. "వామ్మో ఇదేంటి గురు!! నాగశౌర్య.. దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకేంటో తేడాగా కనిపిస్తోంది. నువ్వు ఏమంటావ్?" అని రిప్లై ఇచ్చారు. దీనిపై శౌర్య స్పందిస్తూ.. "నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నాకూ ఏదో తేడాగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే" అని అన్నారు. ఇలా వీరి మధ్య సరదాగా సంభాషణ సాగింది.
ఇక, సినిమా విషయానికి వస్తే లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనీష్ కృష్ణా దర్శకత్వం వహిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో షీర్లే సేతియా కథానాయిక.