పవన్‌కల్యాణ్-రానా కీలకపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ సూపర్‌హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్' తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇటీవల పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చిత్రీకరణలో అడుగుపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను గణంతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.
సెట్లో అడుగుపెట్టిన రానా.. పవన్‌తో ఫైట్! - అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్
'అయ్యప్పనుమ్ కోశియుమ్' తెలుగు రీమేక్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇప్పటికే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చిత్రీకరణలో పాల్గొనగా.. రానా దగ్గుబాటి కూడా గురువారం షూటింగ్ పాల్గొన్నారని చిత్రబృందం తెలిపింది.
సెట్లో అడుగుపెట్టిన రానా.. పవన్‌తో ఫైట్ సీన్!
గురువారం నుంచి రానా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొన్నారని చిత్రబృందం సోషల్‌మీడియాలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్, స్క్రీన్‌ప్లేతో పాటు మాటల్ని అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
ఇదీ చూడండి:కిర్రాక్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్