తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తన శ్రీమతికి ఫోన్లో ఐలవ్యూ చెప్పిన బాలకృష్ణ - Rana Daggubati in Unstoppable With NBK

ఆహా ఓటీటీలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న 'అన్​స్టాపబుల్'​ షోలో సందడి మాములుగా ఉండటం లేదు! ఇటీవలే రానా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై నవ్వులు పూయించారు. ఇక ప్రోగ్రామ్​లో ఉండగా బాలయ్య తన భార్య వసుంధరకు ఫోన్​ చేసి ఐలవ్యూ అని చెప్పడం విశేషం.

Balakrishna
unstoppable with nbk

By

Published : Jan 2, 2022, 10:45 PM IST

రానా దగ్గుబాటి అడిగిన మేరకు బాలకృష్ణ తన సతీమణికి ఫోన్లో ప్రపోజ్‌ చేశారు. 'వసూ.. ఐ లవ్‌ యు' అని బాలకృష్ణ తన ప్రేమను వ్యక్తం చేయగా 'నాకు తెలుసు మీరెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు' అంటూ వసుంధర సమాధానమిచ్చారు. 'అన్‌స్టాపబుల్' కార్యక్రమంలో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఇది. ఈ షోకి రానా అతిథిగా విచ్చేశారు. తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న అనంతరం బాలకృష్ణ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే 'మీరెప్పుడైనా వసుంధరగారికి ఐ లవ్‌ యు అని చెప్పారా' అని అడగ్గా 'నీకెందుకయ్యా' అంటూ బాలకృష్ణ నవ్వులు పంచారు. ఆ తర్వాత తన శ్రీమతికి ఫోన్‌ చేశారు. పెళ్లి గురించి అడుగుతూ బాలకృష్ణ.. రానాని ఓ ఆట ఆడుకున్నారు. 'అప్పట్లో పూలరంగడులా తిరిగేవాడివి, నువ్వు ఎంతమందికి హ్యాండ్‌ ఇచ్చావో, ఎంతమందికి నో చెప్పావో గూగుల్‌ చెప్తుంది' అంటూ వినోదం పంచారు. ఇదే వేదికపై 'ఏమంటివి ఏమంటివి' అనే భారీ డైలాగ్‌తో రానా అలరించారు.

ఇదీ చూడండి:'ఇంటర్​స్టెల్లార్' కబుర్లు చెప్పకమ్మా.. సుకుమార్​తో బాలయ్య

ABOUT THE AUTHOR

...view details