తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేరళ అడవుల్లో రానాతో సాయిపల్లవి - Virata Parvam in Kerala forest

విరాటపర్వం సినిమా షూటింగ్​ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఇందులో సాయిపల్లవి నక్సలైట్​గా కనిపిస్తుండటం వల్ల ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

కేరళ అడవుల్లో రానాతో సాయిపల్లవి
హీరో రానా

By

Published : Jan 18, 2020, 5:16 AM IST

భళ్లాలదేవుడు రానా.. తెలుగులో ప్రస్తుతం 'విరాటపర్వం' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను కేరళలోని మలయత్తూర్​లో తీస్తున్నారు. ఇతడితో పాటు కథానాయిక సాయిపల్లవి షూటింగ్​లో పాల్గొంది. త్వరలో విడుదల తేదీపై చిత్రబృందం స్పష్టతనివ్వనుంది.

కేరళలో 'విరాటపర్వం' సినిమా షూటింగ్

1992లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నక్సలైట్​గా, రానా పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. వీరితో పాటే టబు, ప్రియమణి, నందితా దాస్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్​బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విరాటపర్వం ఫస్ట్​లుక్

ABOUT THE AUTHOR

...view details