టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవలే ప్రేమ విషయాన్ని వెల్లడించారు. తన ప్రేయసి మిహీకా బజాజ్ ఆయన ప్రేమను ఒప్పుకున్నట్లు తెలిపారు. త్వరలోనే పెళ్లి కూడా చేస్తామని ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేశ్ బాబు స్పష్టం చేశారు. తాజాగా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఈరోజు జరగబోతుంది. రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 4 గంటలకు ఈ వేడుక నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేయనున్నారు.
రానా, మిహీకా ఎంగేజ్‌మెంట్ నేడే - Rana Daggubati and Miheeka Bajaj Engagement today
ప్రముఖ హీరో రానా ఎంగేజ్‌మెంట్ ఈరోజు జరగబోతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్శితార్థ వేడుక నిర్వహించనున్నారు.
రానా
మిహీక స్వస్థలం హైదరాబాద్. ఆమె 'డ్యూ డ్రాప్ స్టూడియో' అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతోంది. రానా, మిహీక కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.