తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దున్నతో భళ్లాలదేవుడి ఫైట్‌.. ఇలా తీశారు! - rana bull fight

'బాహుబలి'లో భళ్లాల దేవుడు(రానా).. అడవి దున్నతో పోరాడే సన్నివేశాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఆ సీన్​ అంతలా మునివేళ్లపై కూర్చోపెడుతుంది. అయితే ఆ సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించారో మీరూ చూసేయండి.

Rana Bahubali bull fight scene
దున్నతో భళ్లాలదేవుడి ఫైట్

By

Published : Mar 27, 2021, 6:24 PM IST

విజువల్‌ వండర్‌గా యావత్‌ సినీ ప్రపంచాన్ని సంభమాశ్చర్యాలకు గురి చేసిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు ఖ్యాతిని ప్రపంచ యవనికపై నిలిపింది. ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, నాజర్‌, తమన్నా, సత్యరాజ్‌ల నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక మాహిష్మతి సామ్రాజ్యం, కుంతల రాజ్యం, కాలకేయులతో యుద్ధ సన్నివేశాలు థియేటర్‌లో చూస్తుంటే ప్రేక్షకులకు రెండు కళ్లూ సరిపోలేదంటే అతిశయోక్తి కాదు.

ఏది నిజమో.. ఏది విజువల్‌ ఎఫెక్ట్‌ సన్నివేశమో తెలియనంతగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దీన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా దర్శకుడి ఊహకు తగిన విధంగా వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు శ్రీనివాసమోహన్‌ అందించిన సన్నివేశాలు సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. ముఖ్యంగా భళ్లాల దేవుడు.. అడవి దున్నతో ఫైట్‌ చేసే సీన్‌ గగుర్పాటు కలిగిస్తుంది. ఆ సన్నివేశాలను ఎలా తెరకెక్కించారో మీరూ చూసేయండి.

ఇదీ చూడండి: 'బాహుబలి' గర్జనకు ఐదు వసంతాలు

ABOUT THE AUTHOR

...view details