దగ్గుబాటి హీరో రానా కథానాయకుడిగా నటించిన బహుభాషా చిత్రం 'అరణ్య'. ఈ సినిమాకు సంబంధించిన తమిళ, తెలుగు ట్రైలర్ విడుదలైంది. విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో 'హాథీ మేరే సాథీ', తమిళ్‌లో 'కాందన్' పేర్లతో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తాజాగా మరో కొత్త వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నట్లు ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది విడుదలకానుంది. 'ఓ మాయ్' పేరుతో క్రైమ్ థిల్లర్ కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఇందులో సాక్షి తన్వార్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.