దగ్గుబాటి హీరో రానా కథానాయకుడిగా నటించిన బహుభాషా చిత్రం 'అరణ్య'. ఈ సినిమాకు సంబంధించిన హిందీ ట్రైలర్(మార్చి 4), తమిళ, తెలుగు ట్రైలర్ మార్చి 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. హిందీలో 'హాథీ మేరే సాథీ', తమిళ్‌లో 'కాండన్' పేర్లతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నెల మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.
నటుడు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా 'వై' మోషన్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను బాలు అడుసుమిల్లి తెరకెక్కిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా వస్తోన్న చిత్రం 'రొమాంటిక్'. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీని మార్చి 1 ఉదయం 10 గంటలకు ప్రకటించనున్నారు.