తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరుతో వెబ్​సిరీస్​లో నటించాలని ఉంది' - రమ్యకృష్ణ చిరంజీవి తాజా వార్తలు

మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఉందని తెలిపారు హీరోయిన్ రమ్యకృష్ణ. అయితే సినిమాలో కాదు వెబ్​ సిరీస్​ చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

మెగాస్టార్
మెగాస్టార్

By

Published : May 19, 2020, 8:38 PM IST

టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడు చిరంజీవి, రమ్యకృష్ణ జంటకు మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఈ జోడీ తెరపై సందడి చేసి చాలా కాలం అయింది. అందుకే మరోసారి చిరుతో నటించాలనే తన మనసులో మాట ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు రమ్యకృష్ణ. అది సినిమా మాత్రం కాదట. వెబ్‌ సిరీస్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

జయలలిత జీవితాధారంగా తెరకెకిక్కిన 'క్వీన్‌' వెబ్‌ సిరీస్‌లో నటించారు రమ్యకృష్ణ. ఇందులో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. అందుకే వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ చిరుతో నటించాలనుందని తెలిపారు. చిరు కూడా వెబ్‌ సిరీస్‌ల వైపు దృష్టి పెట్టనున్నట్లు వార్తలొచ్చాయి. మరి ఈ జోడీ ఎప్పుడు కలిసి నటిస్తారో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details