'సామజవరగమన' అంటూ యూట్యూబ్‌లో బన్నీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. సిద్ శ్రీరామ్ గానం, తమన్ సంగీతం కుర్రకారును అమితంగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే యూట్యూబ్‌లో ఎక్కువ లైక్స్, వీక్షణలతో దూసుకుపోతుందీ గీతం. ఈ పాట జోరు ఇలా ఉండగానే మరో సాంగ్‌తో రెడీ అయింది 'అల వైకుంఠపురములో' చిత్రబృందం. 'రాములో రాములా' అంటూ సాగే ఈ పాట టీజర్‌ను విడుదల చేసింది.
'రాములో రాములా..' అంటోన్న బన్నీ - ala vaikunta puramilo second single
'అల వైకుంఠపురమములో' చిత్రం నుంచి 'రాములో రాములా' పాట టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి సాంగ్ దీపావళి కానుకగా అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
!['రాములో రాములా..' అంటోన్న బన్నీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4833504-thumbnail-3x2-bunny.jpg)
రాములో
మొదటి పాటలాగే ఈ సాంగ్ బీట్ బాగుంది. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్నాడు. తమన్ సంగీతం అందించిన ఈ పూర్తి పాటను దీపావళి కానుకగా అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
ఇవీ చూడండి.. 'భారత్ కీ లక్ష్మీ' ప్రచారకర్తలుగా దీపికా, సింధు