అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వీక్షణలు దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని 'రాములో రాములా' పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
'రాములో రాములా' పూర్తి వీడియో వచ్చిందిగా - అల వైకుంఠపురములో
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాలోని 'రాములో రాములా' పూర్తి వీడియో పాటను విడుదల చేసింది చిత్రబృందం.
రాములో రాములో
తమన్ సంగీతం, అనురాగ్ కులకర్ణి గాత్రం, కాసర్ల శ్యాం లిరిక్స్ ఈ గీతానికి ప్రధాన బలమయ్యాయి. మాస్ ఆడియన్స్‌తో పాటు యువత ఈ పాటను బాగా ఆదరించారు.