తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్​సే మృతి

1970-80 దశకంలో హర్రర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్​సే.. ముంబయిలో తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయాన్నే న్యూమోనియోతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. అక్కడే కన్నుమూశారు.

శ్యామ్ రామ్​సే

By

Published : Sep 18, 2019, 12:26 PM IST

Updated : Oct 1, 2019, 1:13 AM IST

బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్​సే(67) ముంబయిలోబుధవారం తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఈయన.. చికిత్స నిమిత్తం ఈ రోజు ఉదయమే ఆసుపత్రిలో చేరారు. రామ్​​సే సోదరుల్లో ఒకరైన శ్యామ్​కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులే తెలియజేశారు.

"శ్యామ్.. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఒంట్లో నలతగా ఉండటం వల్ల ఈ రోజు ఉదయమే ఆసుపత్రిలో చేర్పించాం. ఇంతలోనే ఇలా జరిగింది" -శ్యామ్ రామ్​సే కుటుంబ సభ్యులు

శ్యామ్​ రామ్​సే హర్రర్ చిత్రాలు

1970, 80ల్లో హర్రర్ సినిమాలతో బాలీవుడ్​లో గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామ్. 'పురానీ హవేలి', 'తఖానా', 'దర్వాజా', 'పురానా మందిర్', 'వీరానా' లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.

ఇదీ చదవండి: గులాబీ మొక్కకు మద్యం పోస్తున్న ఆ హీరో

Last Updated : Oct 1, 2019, 1:13 AM IST

ABOUT THE AUTHOR

...view details