తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఈ చిత్రానికి 'మర్డర్: కుటుంబ కథా చిత్రమ్' అని టైటిల్‌ను ఖరారు చేస్తూ.. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో అమృత, మారుతీరావు పాత్రధారులు ఉన్నారు.
ప్రణయ్-అమృత ప్రేమకథ నుంచి పోస్టర్ విడుదల - ప్రణయ్ అమృత
ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా ప్రణయ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా చేసుకుని రామ్‌గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఓ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆర్జీవీ సోషల్‌మీడియాలో ఆదివారం విడుదల చేశారు.

ప్రణయ్ హత్యోదంతంపై ఆర్జీవీ సినిమా
ఈ చిత్రంలో అమృత, ప్రణయ్‌ల ప్రేమతో మొదలుకొని.. ఇటీవలె మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటలను చూపించనున్నారు. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. నట్టి కరుణ, నట్టి క్రాంతి సినిమాకు నిర్మాతలు.
ఇదీ చూడండి...'నాన్నకు ప్రేమతో': బాలీవుడ్ తారల పోస్టులు