తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేసీఆర్ బయోపిక్​ తీస్తున్న వివాదాల దర్శకుడు - రాంగోపాల్ వర్మ

దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్  తీసేందుకు  సిద్ధమయ్యాడు. సంబంధిత పోస్టర్​ను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

కేసీఆర్ బయోపిక్​ తీస్తున్న వివాదాల దర్శకుడు

By

Published : Apr 18, 2019, 3:37 PM IST

Updated : Apr 18, 2019, 4:36 PM IST

వివాదాల్నే సినిమాలుగా తీసే రాంగోపాల్ వర్మ మరో ఆసక్తికర బయోపిక్​కు రంగం సిద్ధం చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ జీవితంపైనా సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్​ ద్వారా ప్రకటించాడు.

పోస్టర్​ను ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ

టైగర్ అనే టైటిల్​ మధ్యలో కేసీఆర్ పేరుతో ఉన్న ఈ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ద అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్​ను జత చేశాడు. 'ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అనే డైలాగ్​ను పోస్టర్​పై ముద్రించాడు. మరి కేసీఆర్ పాత్రలో ఎవరూ నటిస్తారో చూడాలి.

దర్శకుడుగానే కాకుండా నటుడిగానూ ప్రస్తుతం కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు వర్మ. అది కాకుండా శశికళ బయోపిక్ తీస్తున్నట్లు ఈ మధ్యే ప్రకటించాడు.

Last Updated : Apr 18, 2019, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details