'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఆయన విజయవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా వర్మ తాను చదువుకునే రోజుల్లో నివసించిన హాస్టల్ భవనానికి వెళ్లారు. అయితే ఒకప్పుడు అబ్బాయిల హాస్టల్‌గా ఉన్న ఆ భవనం... ఇప్పుడు అమ్మాయిలకు కేటాయించారు. అయినప్పటికీ వర్మ హాస్టల్లోనికి వెళ్లి తాను రెండేళ్ల పాటు నివసించిన గదిని చూసుకొని మురిసిపోయారు. ''ఈ గదిలోని గోడపైనే నేను అమితంగా ఆరాధించిన శ్రీదేవి పోస్టర్‌ను అతికించుకొని చూసుకునేవాడిని'' అని ఆనాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఆ గదిలో ఉంటోన్న యువతులతో కలిసి సెల్ఫీ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు ఆర్జీవీ.
ఆ గోడపైనే నా డ్రీమ్ గర్ల్ ఉండేది: ఆర్జీవీ
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో సెగలు పుట్టించే రామ్‌గోపాల్ వర్మ.. తాజాగా ఓ ఆసక్తికర ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అలనాటి స్వప్నసుందరి శ్రీదేవీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
రామ్‌గోపాల్ వర్మకు శ్రీదేవీ గుర్తొచ్చింది
"సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇదే గదిలో రెండేళ్లు ఉన్నాను. ప్రస్తుతం దాన్ని అమ్మాయిల హాస్టల్ కింద మార్చేశారు. ఆ రూమ్‌లో ఇప్పుడు లవ్లీ గాళ్స్ ఉంటున్నారు. అప్పట్లో ఈ వెనక కనిపిస్తున్న గోడపైనే శ్రీదేవి పోస్టర్ అతికించాను".
-- రామ్‌గోపాల్ వర్మ, సినీ దర్శకుడు