తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RGV Unstoppable: 'బాలయ్య.. 'అన్‌స్టాపబుల్‌'కు నేనూ వస్తా' - బాలకృష్ణ అన్​స్టాపబుల్​

Unstoppable Ramgopal varma: దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ.. తొలిసారి ఓ టాక్​ షోలో అవకాశమివ్వండంటూ ట్వీట్​ చేశారు. హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్'​ అద్భుతంగా ఉందని, అందులో తాను పాల్గొనేందుకు అవకాశమివ్వాలని బాలయ్యను కోరారు.

Unstoppable Ramgopal varma
Unstoppable Ramgopal varma

By

Published : Jan 19, 2022, 7:50 PM IST

Unstoppable Ramgopal varma: ఏపీ టికెట్‌ ధరల అంశంతో పాటు ట్విటర్‌, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ. ఇప్పటి వరకూ ఏ టాక్‌ షోకు 'నన్ను పిలవండి' అని అడగని ఆయన.. తొలిసారి ఓ టాక్‌ షోలో అవకాశమివ్వండంటూ ట్వీట్‌ చేశారు.

ప్రముఖ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' కార్యక్రమం ఓ రేంజ్‌లో ఉందని.. అందుకే ఆ షోలో పాల్గొని మాట్లాడాలనుకుంటున్నా అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. 'బాలయ్య గారు ఈ అవకాశాన్ని ఇస్తార'ని ఆశిస్తున్నానని ట్వీట్‌ చేశారు. కాగా, కొద్దిసేపటికే ఆర్జీవీ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. దీని వెనుక గల కారణం తెలియాల్సి ఉంది.

ఆర్జీవీ ట్వీట్​

ఆర్జీవీ ట్వీట్‌ను డిలీట్‌ చేసే లోపే వైరల్‌ కావడం వల్ల నెటిజన్లు ఒకే వేదికపై బాలయ్య, ఆర్జీవీ సంభాషిస్తే.. ఆ ఎపిసోడ్‌ కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి: ఉత్కంఠంగా 'సామాన్యుడు' ట్రైలర్​.. 'జైభీమ్​' మరో రికార్డు

ABOUT THE AUTHOR

...view details