తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో రామ్​చరణ్​కు కరోనా పాజిటివ్​ - చెర్రీకి కరోనా

ram
రామ్​

By

Published : Dec 29, 2020, 8:01 AM IST

Updated : Dec 29, 2020, 9:45 AM IST

07:54 December 29

హీరో రామ్​చరణ్​కు కరోనా పాజిటివ్​

యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు. ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్​లో ఉన్నట్లు వెల్లడించారు. 

"నేను కరోనా బారినపడ్డా.  తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. అయితే, కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నా. గత రెండు రోజులుగా నన్ను కలిసిన వాళ్లు, నాతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోగలరు. నా రికవరీపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తా"

- రామ్‌చరణ్, కథానాయకుడు

చెర్రీ ప్రస్తుతం రెండు కీలక ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్'‌లో నటిస్తున్నారు. దీంతో పాటు చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న 'ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిహారిక వివాహం కారణంగా కొంతకాలంగా ఆయన షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నారు.

Last Updated : Dec 29, 2020, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details