తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాబాయ్ పవర్​స్టార్​ నిర్మాణంలో చెర్రీ - ram charan latest movie with pawan kalyan

స్టార్ హీరో పవన్​ కల్యాణ్..​ త్వరలోనే నిర్మాతగా ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో తన అన్న చిరంజీవి కొడుకు రామ్​చరణ్​ హీరోగా నటించనున్నాడు. అయితే మంచి కథ కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు పవన్.

ramcharan tej news film with his babay pawankalyan production
బాబాయ్​ నిర్మాణంలో చెర్రీ

By

Published : Dec 17, 2019, 2:23 PM IST

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా మొదలు కానుంది. 'పింక్' రీమేక్​గా ఈ చిత్రం రూపొందనుంది. దిల్​రాజు నిర్మాత. వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీత దర్శకుడు. ఫిబ్రవరిలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్​ ప్రారంభం కానుంది. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్.. తన భవిష్యత్తు సినీ ప్రయాణం గురించి చెప్పాడు. నిర్మాతగా, రామ్​చరణ్​తో త్వరలో ఓ సినిమా తీస్తానని అన్నాడు.

పవన్‌.. రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. నిర్మాతగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతూ ఉంటానని గతంలోనే చెప్పాడు. ఈ విషయంపై ఇప్పుడు మరోసారి స్పష్టతిచ్చాడు. చెర్రీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, సరైన కథ, దర్శకుడు దొరకకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని పవన్​ అన్నాడు. రామ్‌చరణ్‌తోత్వరలోఓ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్తానని చెప్పాడు.

చరణ్​.. బాబాయ్‌ నిర్మాణంలో సినిమా చేయాలనుందని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు పవన్‌ ప్రకటనతో అతడి కోరిక తీరడం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇవీ చూడండి.. 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు

ABOUT THE AUTHOR

...view details