మెగాఫ్యామిలీ అంతా ఒకే చోట చేరితే అక్కడ సందడి వాతవారణం మాములుగా ఉండదు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు, రాఖీ పండగ ఒకే రోజు వచ్చాయి. ఈ సందర్భంగా చిరు ఇంట్లో మెగా కుటుంబంతా కలిసి ఈ రెండు వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. రామ్‌చరణ్(Ramcharan images) తన అక్కాచెల్లెళ్లు శ్రీజ, సుస్మిత, నిహారికతో రాఖీ కట్టించుకుని సరదాగా గడిపారు.
తాజాగా ఆగస్టు 29(ఆదివారం)న మెగాసిస్టర్స్ను వీకెండ్ లంచ్ కోసం ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు రామ్‌చరణ్. వారితో కలిసి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది నిహారిక. రాఖీ ట్రీట్‌లో భాగంగా సోదరిమణులతో కలిసి చెర్రీ ఆనందంగా గడిపారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..