మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు కుటుంబాలు కలిసి ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నాయి. ఉపాసన, సానియా కూడా మంచి స్నేహితులే. తాజాగా ఈ మెగా దంపతులు సానియా సోదరి పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
సానియాతో చరణ్ చిందులు.. వీడియో వైరల్ - upasana konidela
మెగా హీరో రామ్ చరణ్ ఇటీవల జరిగిన సానియా మీర్జా సోదరి పెళ్లికి హాజరయ్యాడు. ఈ వేడుకలో సానియా, ఫరా ఖాన్లతో కలిసి చరణ్ డ్యాన్స్ చేస్తోన్న వీడియోను ఉపాసన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
ఉపాసన
అయితే ఈ వేడుకలో రామ్చరణ్.. సానియా, ఫరాఖాన్లతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనిని ఉపాసన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి రాకింగ్ డ్యాన్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇవీ చూడండి.. గొల్లపూడి భౌతికకాయానికి చిరు నివాళి