తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2022, 7:49 AM IST

ETV Bharat / sitara

శంకర్​- రామ్​చరణ్ సినిమా విడుదల అప్పుడే..!

Ramcharan New Movie: శంకర్‌ - రామ్‌చరణ్‌ కాంబినేషన్​లో కొత్త సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు నిర్మాత దిల్​రాజు. ఇప్పటికే రెండు షెడ్యుల్స్ పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన రౌడీబాయ్స్ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా పలు విషయాలు తెలిపారు.

Ramcharan New Movie
రామ్​చరణ్

Ramcharan New Movie:శంకర్‌ - రామ్‌చరణ్‌ల కలయికలో కొత్త సినిమా చిత్రీకరణ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందని నిర్మాత దిల్​రాజు తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన 'రౌడీ బాయ్స్​' ఈ సంక్రాంతికి విడుదలకానుంది. ఈ నేపథ్యంలో పలు విషయాలు తెలిపారు.

వచ్చే సంక్రాంతికి రామ్‌చరణ్‌ చిత్రం

Shankar Ramcharan New Movie: ''రౌడీబాయ్స్‌' పూర్తిగా యువతరం సినిమా. నా బ్రాండ్‌ దాటి చేసిన చిత్రమిది. ఇప్పటిదాకా నా సినిమాల్లో ముద్దు సీన్స్‌ లేవు. తొలిసారి ఈ చిత్రంలో ఉన్నాయి. అందుకే ట్రైలర్‌లోనే ముద్దు సీన్‌ను చూపించేశాం. రేపు ఫ్యామిలీ ప్రేక్షకులు వచ్చినా ఇబ్బంది పడొద్దనే.. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూపించాం. ప్రస్తుతం నా బ్యానర్‌లో రూపొందుతోన్న 'థ్యాంక్‌ యూ', 'ఎఫ్‌3' చిత్రాలు తుది దశ చిత్రీకరణలో ఉన్నాయి. శంకర్‌ - రామ్‌చరణ్‌ల కలయికలో నిర్మిస్తున్న సినిమా.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. హిందీలో 'జెర్సీ', 'హిట్‌' చిత్రాలు నిర్మించా. త్వరలో విడుదలవుతాయి. విజయ్‌, వంశీ పైడిపల్లి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలో పట్టాలెక్కుతుంది".

- నిర్మాత దిల్‌రాజు.

ఆ సన్నివేశాల్లో నటించడం కష్టంగా ఉండేది..

Rowdy Boys Movie News: "యువతరం లక్ష్యంగా తెరకెక్కించిన చిత్రం 'రౌడీబాయ్స్‌'. ఇదొక చక్కటి మ్యూజికల్‌ ట్రీట్‌లా ఉంటుంది" అన్నారు ఆశిష్‌. ప్రముఖ నిర్మాత శిరీష్‌ తనయుడాయన. ఇప్పుడు 'రౌడీబాయ్స్‌'తో హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు ఆశిష్‌. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

  • "కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ ఇది. ఇంజినీరింగ్‌, మెడికల్‌ విద్యార్థుల మధ్య సాగే కథగా ఉంటుంది. ఇది నా వయసుకు తగ్గ కథ కాబట్టి.. వినగానే బాగా కనెక్ట్‌ అయింది. అందుకే సులువుగా కథలోకి వెళ్లగలిగాను. దర్శకుడు శ్రీహర్ష తన కాలేజీ జీవితంలో చూసిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నారు. సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంటుంది. 9 పాటలుంటాయి. చివరి 20 నిమిషాల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ పాటలొస్తాయి".
  • "నా పాత్ర కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిఫరెన్స్‌ తీసుకోలేదు. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు దర్శకుడు హర్ష మేమూ కలిసి ప్రతిరోజూ గంటల పాటు వర్క్‌ షాప్‌ చేసేవాళ్లం. దానికి తోడు నేనూ ఈ మధ్యే కాలేజీ పూర్తి చేసొచ్చాను కాబట్టి.. కథకు, నా పాత్రకు ఈజీగా కనెక్ట్‌ అవ్వగలిగాను. ఈ సినిమా విషయంలో నాకు సవాల్‌గా అనిపించినవి రొమాంటిక్‌ సన్నివేశాలే. సెట్లో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించడం చాలా కష్టంగా ఉండేది. అలాగే ఈ చిత్రంలో ఓ మంచి డ్యాన్స్‌ నెంబర్‌ ఉంది. స్పాట్‌లో జానీ మాస్టర్‌ చెప్పేది చూసి.. అప్పటికప్పుడు చేసేవాణ్ని. ఆ పాట విషయంలో కాస్త టెన్షన్‌ పడ్డా".
  • "ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్‌ మంచి పాటలిచ్చారు. నా తొలి సినిమాకి ఆయన సంగీతమందిస్తున్నారని తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డాను. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. ఈ చిత్రానికి వచ్చే ఆదరణను బట్టి నా తర్వాతి సినిమాల్ని ఎంచుకుంటాను".
  • "నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. మా కుటుంబ వేడుకలు, పార్టీల్లో డ్యాన్సులు చేసేవాడిని. మెల్లమెల్లగా డ్యాన్స్‌పై, నటనపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్‌ నాకు స్ఫూర్తి. ఆయనలా నేర్చుకోవాలని అనుకున్నా. కొన్ని కోర్సులు చేసి డ్యాన్సుల్లో పర్‌ఫెక్ట్‌ అయ్యాను. న్యూయార్క్‌లో ఫిల్మ్‌ కోర్సులు చేశాను. అలాగే సత్యానంద్‌, భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. 'కేరింత' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాను. హీరోగా మారే క్రమంలో బాగా కసరత్తులు చేసి దాదాపు 25కేజీల బరువు తగ్గాను. ప్రస్తుతం కాశీ అనే కొత్త దర్శకుడితో 'సెల్ఫిష్‌' అనే సినిమా చేస్తున్నాను. సుకుమార్‌ రైటింగ్స్‌లో ఈ చిత్రం పట్టాలెక్కుతుంది"

ఇదీ చదవండి:బంగార్రాజులో చాలా సర్​ప్రైజ్​లు ఉంటాయి: నాగ్

ABOUT THE AUTHOR

...view details