మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రాజెక్ట్‌ల విషయంలో దూకుడు పెంచేశారు. శంకర్ సినిమా షూట్ ప్రారంభంకాకముందే ఆయన మరో సినిమా ప్రకటించేశారు. ఈ మేరకు చెర్రీ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. రామ్ చరణ్ 16వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఉదయం చరణ్ ట్వీట్ చేశారు. ఈ కాంబినేషన్ కోసం తాను ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గౌతమ్ సైతం.. చెర్రీతో కలిసి పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ‘జెర్సీ’ విడుదలైన సమయంలో గౌతమ్ పనితనాన్ని ప్రశంసిస్తూ చరణ్ దంపతులు ఓ లేఖ రాశారు. తాజాగా ఆ లేఖను ట్విటర్లో షేర్ చేసిన గౌతమ్.. ‘ఎంతోకాలం నుంచి ఈ లేఖను దాచిపెట్టుకున్నాను. చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బయట ప్రపంచానికి చూపించాలనుకున్నాను. ఇంత త్వరగా ఈ అవకాశం నాకు వస్తుందని అనుకోలేదు. లవ్ యూ చరణ్ సర్’ అని గౌతమ్ ట్వీట్ చేశారు.
'జెర్సీ' డైరెక్టర్‌తో రామ్‌చరణ్ పాన్ ఇండియా మూవీ
హీరో రామ్‌చరణ్(RC 16 movie) మరో కొత్త పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పారు. తన కొత్త చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో(gowtam tinnanuri ram charan) నటించనున్నారు. చెర్రీ 16వ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందనుంది.
రామ్‌చరణ్
ప్రస్తుతం రామ్‌చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ రెండు పూర్తైన వెంటనే ఆయన శంకర్‌తో చేయనున్న సినిమా రెగ్యులర్ షూట్లో పాల్గొననున్నారు. పవర్ఫుల్ కథాంశంతో సిద్ధం కానున్న ఈ సినిమాలో చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దిల్‌రాజు నిర్మాత.
ఇదీ చూడండి: ఒకే వేదికపై చిరు-బాలయ్య.. ఫ్యాన్స్‌కు పండగే!
Last Updated : Oct 15, 2021, 2:37 PM IST