ఓ కథానాయకుడు నటించాల్సిన చిత్రంలో మరో హీరో నటించడం సహజం. ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. ప్రముఖ నటులు రామ్ చరణ్, నాని విషయంలో ఒకప్పుడు ఇదే జరిగింది. గతంలో చెర్రీ నటించాల్సిన ఓ ప్రేమకథలో నాని నటించి యువత హృదయాల్ని హత్తుకున్నాడు. అదే సినిమా అంటే? 'ఎటో వెళ్లిపోయింది మనసు'.
రామ్ చరణ్ వద్దంటే.. నాని చేశాడట..! - గౌతమ్ మేనన్
చిత్రసీమలో ఒక హీరో చేయలేకపోయిన కథతో మరొక హీరో హిట్ అందుకున్న సందర్భాలున్నాయి. టాలీవుడ్లో అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. రామ్చరణ్ చేయలేకపోయిన సినిమాతో నాని విజయాన్ని అందుకోవడమే అందుకు ఉదాహరణ.
రామ్ చరణ్ వద్దంటే.. నాని చేశాడట
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముందుగా చెర్రీని కథానాయకుడిగా అనుకున్నారట. డేట్స్ సర్దుబాటు కాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడట చరణ్. దాంతో ఈ ప్రేమకథలో నటించే అవకాశం నానిని వరించింది. నానికి కథ బాగా నచ్చడం వల్ల ఓకే చేశాడు. అలా 'ఎటో వెళ్లిపోయింది మనసు' అంటూ సమంతను ఉద్దేశించి 'ప్రియమతా నీవచట కుశలమా' పాటను అందుకున్నాడు.
ఇదీ చూడండి.. 'సామజవరగమన..' పాటకు కేటీఆర్ ఫిదా
Last Updated : Feb 17, 2020, 10:57 PM IST