'మహర్షి' చిత్రంతో సూపర్‌హిట్ అందుకుని జోరుమీదున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. తదుపరి చిత్రాన్నీ మహేశ్‌తోనే తీయాలని అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దీంతో ఆ కథ కోసం హీరోను వెతికే ప్రయత్నాల్లో ఉండిపోయాడు వంశీ. ఈ క్రమంలోనే అనేక మంది అగ్ర కథానాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ ఈ జాబితాలో చేరాడు. ఇటీవలే చెర్రీకి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేసి వినిపించినట్లు సమాచారం. చరణ్‌కు కూడా కథ నచ్చిందని.. త్వరలోనే ఓకే చెప్పే అవాకాశాలున్నాయని సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై స్పష్టత రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ సినిమా ఎవరితో? - ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్రలో నటిస్తున్నాడు రామ్‌చరణ్. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో పాటు, మరికొంత మంది దర్శకులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.
రామ్ చరణ్
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో చరణ్ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యాక వంశీతో పాటు మరికొంత మంది దర్శకులు చెర్రీతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చరణ్ ముందు ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి.