తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' - రామ్​ చరణ్ తాజా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైరా'. రామ్​చరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదలై నేటికి ఏడాది. ఈ సందర్భంగా ట్విట్టర్​ వేదికగా చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు చరణ్.

RamCharan Feels Happy On Syeraa Completes One Year
'ఈ విజయంలో భాగమైన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు'

By

Published : Oct 2, 2020, 4:33 PM IST

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రామ్‌చరణ్‌ నిర్మించిన చరిత్రాత్మక చిత్రం 'సైరా'. గతేడాది గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. నేటితో ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా రామ్‌చరణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా 'సైరా' టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలిపారు.

"ఉత్తమమైన అనుభవం.. గొప్ప నటీనటులు.. సమర్థవంతమైన సాంకేతిక బృందం.. 'సైరా' విడుదలై సరిగ్గా ఏడాది అవుతోంది. 'సైరా'లో భాగమైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు" అని రామ్‌ చరణ్‌ ట్వీట్ చేశారు.

దర్శకుడు సురేందర్‌ రెడ్డి కూడా 'సైరా' నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. "సైరా నరసింహారెడ్డి' చిత్రానికి ఏడాది. ఈ సినిమా తెరకెక్కించిన అనుభవాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. నాపై నమ్మకం ఉంచి ఇలాంటి చారిత్రక కథలో నన్ను భాగం చేసిన మెగాస్టార్‌ చిరంజీవి సర్​కు, నన్ను ప్రోత్సహించిన రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు. అడిగిన వెంటనే మా సినిమాలో నటించేందుకు ఒప్పుకుని గోసాయి వెంకన్న పాత్రలో ఒదిగిపోయిన అమితాబ్‌ బచ్చన్‌ సర్‌కు కృతజ్ఞతలు. 'సైరా' లాంటి గొప్ప చిత్రం ఆవిష్కృతం కావడానికి ఎంతగానో శ్రమించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా మా చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నమస్సుమాంజలి" అని సురేందర్‌రెడ్డి తెలిపారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి పరుచూరి సోదరులు కథ అందించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మించారు. చిరుకి జంటగా నయనతార నటించగా.. తమన్నా ఓ కీలకపాత్రలో మెరిశారు.

ABOUT THE AUTHOR

...view details