తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ డైరక్టర్​తో రాంచరణ్ మరో సినిమా..! - ఎవడు

మెగాహీరో రాంచరణ్​ త్వరలో వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నాడని సమాచారం. వీరిద్దరూ ఇంతముందే 'ఎవడు' చిత్రానికి కలిసి పనిచేశారు.

ఆ డైరక్టర్​తో రాంచరణ్ మరో సినిమా..!

By

Published : Apr 17, 2019, 8:55 AM IST

టాలీవుడ్ హీరో రాంచరణ్ ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్'​లో నటిస్తున్నాడు. తాజాగా మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. మహేశ్​బాబుతో 'మహర్షి'ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడని సమాచారం. వీరిద్దరూ ఇంతకుముందే 'ఎవడు' సినిమాకు కలిసి పనిచేశారు. మంచి విజయాన్ని అందుకుంది ఆ చిత్రం.

రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'​లో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నాడు. కుమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్​లో షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. ఆలియా భట్ హీరోయిన్​గా నటిస్తోంది.

వంశీ తెరకెక్కించిన 'మహర్షి' మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్​గా నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇది చదవండి: రంగస్థలంలో అభిమానులు మెచ్చిన మగధీరుడు

ABOUT THE AUTHOR

...view details