కరోనా బాధితుల కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మంచి మనసు చాటుకుంటున్నారు. నేడు.. జనసేన అధినేత, హీరో పవన్‌కల్యాణ్ రూ.2 కోట్లు(కేంద్రానికి రూ.కోటి.. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు) విరాళం ప్రకటించగా, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉదారత చాటుకున్నాడు హీరో రామ్‌చరణ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిలీఫ్ ఫండ్స్‌కు కలిపి రూ.70 లక్షలు ఇస్తున్నట్లు తొలి ట్వీట్ చేశాడు.
బాబాయ్ దారిలో అబ్బాయి.. రూ.70 లక్షలు విరాళం - తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిలీఫ్ ఫండ్స్
బాబాయ్ పవన్‌కల్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని కరోనా బాధితుల కోసం రూ.70 లక్షలు విరాళం ప్రకటించాడు హీరో రామ్‌చరణ్. ఈ విషయాన్ని చెబుతూ తొలి ట్వీట్ చేశాడు.
వీరితో పాటే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని అందించనున్నాడు. చెరో రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించాడు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 606 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్‌లో 10 ఉన్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్రప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. స్వీయ నిర్బంధం, వ్యక్తిగత శుభ్రత అనేవి ఈ వైరస్ నివారణకు ముఖ్యమైన మార్గాలని ప్రభుత్వాలతోపాటు పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు.