అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల..వైకుంఠపురములో'. ఈ సినిమాలో 'బుట్టబొమ్మ' పాట సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు వీక్షణలు సొంతం చేసుకుని దూసుకెళుతోంది.
ఎన్నిసార్లు విన్నా మరోసారి వినాలనిపిస్తుంటుందీ పాట. అందుకేనేమో ఇదే పాటకు మరికొంత సాహిత్యం జోడించాడు రామజోగయ్య శాస్త్రి. అయితే ఇది ఆల్బమ్‌లో చేర్చలేదు. "బుట్టబొమ్మ పాటను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సరదాగా మరో నాలుగు లైన్లు రాశాను" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ వినేయండి..'బుట్టబొమ్మ'కు మరింత సాహిత్యం తోడైతే..
"రాజుల కాలం కాదు, రథమూ గుర్రం లేవు, చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేశావే.. బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ.." అనే సాహిత్యంతో సాగిన పాట.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరి నోట మాటలా మారింది. తమన్ సంగీతం అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఈ మెలోడి థియేటర్లలలోనే కాదు మొబైల్ ఫోన్లలోనూ ఇప్పుడు మారుమోగుతుంది. తాజాగా ఈ గీతానికి మరికొంత సాహిత్యాన్ని జోడించాడు రామజోగయ్య శాస్త్రి.
'బుట్టబొమ్మ'కు మరింత సాహిత్యం తోడైతే..
Last Updated : Feb 17, 2020, 6:54 PM IST