లింగుస్వామి(lingusamy) అనగానే తెలుగు ప్రేక్షకులకు మొదట గుర్తుకొచ్చేది 'పందెంకోడి' సినిమానే. అది ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా ఏళ్లే అయినా ఇప్పటికీ ఆ చిత్రాన్ని మరిచిపోలేదు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని అందులో మేళవించిన తీరు ఆకట్టుకుంది.
సీమ టచ్‌తో రామ్-లింగుస్వామి చిత్రం! - రామ్ పోతినేని లింగుస్వామి మూవీ అప్డే
లింగుస్వామి(lingusamy) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందబోతుందని టాక్.
రామ్
అదే తరహా సీమ టచ్‌తో లింగుస్వామి తదుపరి సినిమా కూడా తెరకెక్కనుందని సమాచారం. ఆ సినిమా రామ్ (Ram Pothineni) కథానాయకుడిగా తెరకెక్కనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. రామ్ పోలీస్‌గా సందడి చేయనున్నట్టు సమాచారం. ఈ కథలో రాయలసీమ నేపథ్యం ఉంటుందని తెలిసింది.