సంక్రాంతికి 'రెడ్'తో సందడి చేసిన రామ్ తర్వాతి సినిమాపై ప్రకటన వచ్చేసింది. తమిళ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దీనిని తెరకెక్కించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణంలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారు. మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలో వెల్లడించారు.
ఆ హీరోల దారిలోనే రామ్.. లింగుస్వామితో కలిసి - మూవీ న్యూస్
తన తర్వాతి సినిమా కోసం రామ్ దర్శకుడు లింగుస్వామితో కలిసి పనిచేయనున్నారు. ఈ విషయమై గురువారం అధికారికంగా వెల్లడించారు.
రామ్ కూడా ఆ హీరోల దారిలోనే..
ఇటీవల కాలంలో ప్రభాస్, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు తమ మార్కెట్ పరిధిని విస్తరించడంలో భాగంగా పాన్ ఇండియా కథలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు వారి బాటలోనే వెళ్తున్న రామ్.. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల్ని త్వరలో అలరించనున్నారు.
ఇది చదవండి:'ఆర్ఆర్ఆర్' కోసం రాజమౌళి పక్కా ప్లాన్!