తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామ్ చేతిలో గన్.. డమ్మీ కాదు ఒరిజినల్‌ - ఇస్మార్ట్ శంకర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తుపాకీ ఎక్కుపెట్టి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. మరి ఇది సినిమా కోసమా లేక వేరే విషయమా అని తెలుసుకోవాలని ఉందా. అయితే చదివేయండి.

ram
రామ్​

By

Published : Dec 23, 2019, 8:05 PM IST

ఇదిగో రామ్‌ ఇక్కడ ఒక భారీ సైజు గన్‌ పట్టుకుని విలన్‌ ఎక్కడా అని గురిపెడుతున్నట్టు ఉంది కదూ, కాని ఇది చిత్రీకరణ కాదు.. అతను ఎవర్నీ కాల్చాలనుకోవటం లేదు. మరి అయితే ఈ గన్‌ ఏంటీ, ఆ గురి పెట్టడం ఏంటీ అని అలోచిస్తున్నారా? అతని చేతిలో ఉన్నది డమ్మీ గన్‌ కాదు. అది ఒక నిజం తుపాకి.

రామ్​

వివిధ పోలీసు శాఖలు, రక్షణ దళాలు, మిలిటరీ దళాలకు 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే47 వంటి ఆయుధాలను వారి అవసరాలకు అనుగుణంగా రూపొందించి సరఫరా చేసిన జెన్‌ టెక్నాలజీస్‌ సంస్థ హైదరాబాద్‌లో రజతోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకకు యువ కథానాయకుడు రామ్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆ కార్యక్రమానికి హాజరైన ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ అక్కడ ఉన్న ఆయుధాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి మరీ తెలుసుకున్నాడు. కొన్నిటిని చేతిలోకి తీసుకుని వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుని వాటిపై ప్రయోగం కూడా చేశాడు. షూటింగ్‌ రేంజ్‌ ఎలా ఉంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు.

రామ్​

ఇక్కడ రామ్‌ మాట్లాడుతూ.."ఇంతకుముందు ఎన్నడూ చూడని అనుభవం ఇది...సినిమాలోలాగా లేదు. చాలా కొత్తగా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు" అని చెప్పాడు.

రామ్​

ఇవీ చూడండి.. 'మార్పు స్థిరమైంది' అంటోన్న సుశాంత్

ABOUT THE AUTHOR

...view details