తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ దర్శకుడితో హ్యాట్రిక్​కు సిద్ధమైన రామ్ - puri jagannath

త్వరలో ఓ తమిళ రీమేక్​లో నటించనున్నాడు హీరో రామ్. ఈ కథాానాయకుడితోనే 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ'ని తెరకెక్కించిన కిశోర్ తిరుమల మూడో చిత్రాన్ని తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఆ దర్శకుడితో హ్యాట్రిక్​కు సిద్ధమైన రామ్

By

Published : May 19, 2019, 2:40 PM IST

ప్రస్తుతం పూరీ జగన్నాథ్​ తెరకెక్కిస్తున్న 'ఇస్మార్ట్​ శంకర్'​లో నటిస్తున్నాడు హీరో రామ్. తర్వాత ఓ రీమేక్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు తీసిన కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని టాక్.

కథానాయకుడు రామ్ పోతినేని

తమిళంలో హిట్​గా నిలిచిన 'థడం' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ రీమేక్‌ రైట్స్​ను ఇప్పటికే స్రవంతి రవికిశోర్‌ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రీమేక్​లో రామ్​ కథానాయకుడిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇది చదవండి: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'హీరో' లాంఛనంగా ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details