తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మళ్లీ ప్లాప్‌ డైరెక్టర్‌నే లైన్లో పెడుతున్నాడా..? - tollywood

'ఇస్మార్ట్ శంకర్​'తో భారీ హిట్​ను ఖాతాలో వేసుకున్నాడు హీరో రామ్. త్వరలో వి.వి వినాయక్​తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్​

By

Published : Sep 8, 2019, 5:40 AM IST

Updated : Sep 29, 2019, 8:30 PM IST

కథ నచ్చాలే కానీ, దర్శకుడు హిట్లలో ఉన్నాడా? ప్లాపుల్లో ఉన్నాడా అని అస్సలు పట్టించుకోడు యువ హీరో రామ్‌. ఆ లక్షణమే ఆయనకు 'ఇస్మార్ట్‌ శంకర్‌' వంటి భారీ హిట్‌ను అందుకునేలా చేసింది. ఈ చిత్రానికి ముందు వరకు పూరీ జగన్నాథ్‌ ట్రాక్‌ రికార్డు ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ, ఇలాంటి దశలో ఆయనపై, ఆయన కథపై ఉన్న నమ్మకంతో సెట్స్‌లో అడుగుపెట్టి విజయవంతంగా తమ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నాడు.

ఇప్పుడీ ఉత్సాహంలోనే తన తర్వాతి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు రామ్‌. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ యువ హీరో మరోసారి షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొంత కాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న సీనియర్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇది కూడా ఓ మాస్‌ స్టోరీ లైన్‌తో రూపొందబోయే చిత్రమని.. వినాయక్‌ ఇప్పటికే రామ్‌కు కథ వినిపించాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినాయక్‌ ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో హీరోగా ఓ చిత్రం చేస్తుండటమే ఇందుకు కారణం. ఇందుకోసం తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడీ దర్శకుడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత రామ్‌తో సినిమా పట్టాలెక్కించడం వీలవుతుంది. మరి ఈలోపు ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.

ఇవీ చూడండి.. మాస్​మహారాజా సరసన శ్రుతిహాసన్ మరోసారి​..!

Last Updated : Sep 29, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details