'ఇస్మార్ట్ శంకర్' ఇచ్చిన విజయం తర్వాత.. ఈ ఏడాది 'రెడ్' చిత్రంలో నటించి అలరించారు యువ కథానాయకుడు రామ్ పోతినేని. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్నారు. 'ఉప్పెన' చిత్ర కథానాయిక కృతి శెట్టి నాయిక. ఈ చిత్రం తర్వాత మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో రామ్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
బోయపాటి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో? - బోయపాటి శ్రీను వార్తలు
వరుస హిట్లతో జోష్ మీద ఉన్న ఎనర్జిటిక్ హీరో రామ్.. యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. ఇటీవలే బోయపాటి చెప్పిన కథకు రామ్ అంగీకారం తెలిపారని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
బోయపాటి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో?
ఈ మధ్యే రామ్‌కు బోయపాటి కథ చెప్పారట. అందుకు రామ్ కూడా అంగీకరించారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. బోయపాటి శ్రీను.. ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. ఇది పూర్తవ్వగానే రామ్-బోయపాటిల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
ఇదీ చూడండి:'కథ వినగానే.. ప్రేమలో పడిపోయా'