RAPO19 first look: ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేసింది. 'ద వారియర్' అనే టైటిల్ ఖరారు చేస్తూ, సోమవారం పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో పోలీస్‌గా నటిస్తున్న రామ్.. కెరీర్లో తొలిసారి ఈ పాత్ర చేస్తున్నారు. ఈ పోస్టర్లో మీసకట్టుతో స్టైలిష్‌గా కనిపిస్తూ, అభిమానులను అలరిస్తున్నారు రామ్.
ఇందులో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్గా చేస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
అయితే ఈ పోస్టర్ రావడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు యువ కథానాయకుడు హవీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'వారియర్' అనే టైటిల్ పెట్టడం విశేషం.