తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూరీ సినిమా అంటే.. చొక్కా విప్పాల్సిందేనా! - రామ్

టాలీవుడ్ హీరోలచేత చొక్కాలు విప్పిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్. తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ఆరుపలకల దేహంతో కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్​ తాజాగా విడుదలైంది.

రామ్

By

Published : Apr 10, 2019, 9:26 AM IST

Updated : Apr 10, 2019, 10:01 AM IST

పూరీజగన్నాథ్ అంటేనే విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరుంది. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ హీరోలచేత సిక్స్​ప్యాక్ చేయించి.. చొక్కాలు విప్పించిన ఘనత కూడా పూరీదే. ముందు అల్లుఅర్జున్, తర్వాత ప్రభాస్, జూ.ఎన్టీఆర్, కల్యాణ్​రామ్.. తాజాగా ఈ లిస్టులో హీరో రామ్​ కూడా చేరాడు. 'ఇస్మార్ట్ శంకర్'​ చిత్రంలో చొక్కా విప్పి కండలు చూపిస్తున్నాడీ హీరో.

రామ్

జిమ్​లో శ్రమించి వీ షేప్​ లుక్​తో ఆకట్టుకుంటున్నాడు రామ్. ప్రస్తుతం రామ్ ఇస్మార్ట్​శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మే లో ప్రేక్షకులు ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తుంది. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథే స్వయంగా నిర్మిస్తున్నారు.'

సిక్స్​ ప్యాక్​ హీరోలు

'దేశముదురు' సినిమాలో అల్లు అర్జున్​తో తొలిసారి చొక్కా విప్పించాడీ సంచలన దర్శకుడు. అలాగే 'బుజ్జిగాడు'లో ప్రభాస్​ పలకల దేహాన్నీ చూపించాడు​. 'టెంపర్'​లో జూనియర్​ ఎన్టీఆర్​, 'ఇజం'లో కల్యాణ్​రామ్​ చేత​ సిక్స్​ప్యాక్​ చేయించి ఆశ్చర్యపరిచాడు పూరీ. ప్రస్తుతం హీరో రామ్​ పూరీ కోసం చొక్కా విప్పేస్తున్నాడు. మరీ కండల దేహం రామ్​కు ఏ మేరకు ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.

Last Updated : Apr 10, 2019, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details