యువ కథానాయకుడు రామ్ కొత్త చిత్రం ఖరారైంది. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపేశారు. తమిళ దర్శకుడైన లింగుస్వామి 'పందెం కోడి', 'రన్', 'ఆవారా' తదితర అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.
విశాల్ నటించిన కొత్త సినిమా 'చక్ర' ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన సినిమాను ప్రతిఒక్కరూ థియేటర్‌కు వెళ్లి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సినిమా చూడాలని కోరారు.
'రంగస్థలం' ఫేం మహేష్, రాకేందు మౌళి, 'కంచరపాలెం' రాజు ప్రధాన పాత్రల్లో నటించిన 'హాఫ్స్టోరీస్' సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివవరప్రసాద్ కె. దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తాను నటించిన 'కపటధారి' సినిమా ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు హీరో సుమంత్. ఫిబ్రవరి 19న విడుదల కానుందీ చిత్రం.